- క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
- విజేతగా నిలిచిన జిల్లా పోలీస్ టీం..
రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ :- జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా కోనసాగింది. జిల్లాలోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ప్రారంభించారు. టాస్ గెలిచిన ప్రెస్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టారు.మొదట బ్యాటింగ్ చేసిన ప్రెస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లకు 10 వికెట్స్ కోల్పోయి 83 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జిల్లా పోలీస్ జట్టు నిర్ణీత 11 ఓవర్లలో 7 వికెట్స్ ను కోల్పోయి 84 పరుగులు చేయడం తో పోలీస్ జట్టు 04 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- అనంతరం విజేతలకు బహుమతులు అందించారు
క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రేస్ జట్టు నుండి కిరణ్ కి లభించడం జరిగింది. అనంతరం ఇరు జట్ల సభ్యులకు జిల్లా ఎస్పీ బహమతులు అందించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు. అని అన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపు తో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు,ఆర్.ఐ లు,సి.ఐ లు,ఎస్.ఐ లు పాత్రికేయులు పోలీస్, సిబ్బంది పాల్గొన్నారు.