November 21, 2024
News Telangana
Image default
Telangana

ఇక నుంచి TS కాదు TG.. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..!

News Telangana :- రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చ అమలుపర్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనున్నట్టు సమాచారం. పేరంటే తెలంగాణ పేరు కాదండోయ్.. తెలంగాణ అని సూచించేలా నెంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ అనే అక్షరాలను టీజీ అని మార్చాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చ అమలుపర్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనున్నట్టు సమాచారం. పేరంటే తెలంగాణ పేరు కాదండోయ్.. తెలంగాణ అని సూచించేలా నెంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ అనే అక్షరాలను టీజీ అని మార్చాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నెంబర్ ప్లేట్లపై టీఎస్ TS అనే అక్షరాలు ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి.. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ అని వచ్చేలా TS అని షార్ట్ ఫాంని ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. కేవలం నెంబర్ ప్లేట్లపైనే కాకుండా.. అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా తెలంగాణ స్టేట్ అని వచ్చేలా పేర్లు మారిపోయాయి. అయితే.. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మార్చాలన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ‘టీఎస్’ అనే షార్ట్ ఫాంను.. ఇప్పుడు టీజీ (TG) గా మార్చనున్నట్టు తెలుస్తోంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ ‘టీజీ’ అంశానికి ఆమోదం తెలపనున్నట్టు సమాచారం.

తెలంగాణ ఏర్పడిన సమయంలోనే “టీజీ”గా నిర్ణయిస్తారని అందరూ భావించారు. అప్పటికే ఉద్యమం సమయంలోనూ తెలంగాణను టీజీగా మాట్లాడుకునేవారు, పలు బోర్డులపై ఏపీ అనే స్థానంలో టీజీ అని కూడా రాసేవారు. కానీ.. అనూహ్యంగా టీఎస్ అని తెలంగాణ పేరును కేసీఆర్ సర్కార్ రిజిస్ట్రేషన్ చేపించింది. దీనిపై మొదట్లో ఒకింత వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే.. ‘టీజీ’ అంటే తెలంగాణ అనే ఒకే పదాన్ని రెండుగా విభజించి నట్టవుతుందని.. అది ఒకటే పదంగా ఉంచేందుకే తెలంగాణ స్టేట్ అని వచ్చేలా ‘టీఎస్‌’ అనే అక్షరాలను రిజిస్టర్ చేపించినట్టు పలువురు వివరించారు. మనలాగే కర్ణాటక రాష్ట్రానికి కూడా కేఎస్ (KS) అనే ఉంటుందని.. కూడా ఉదాహరణలు చెప్పారు.

అయితే.. ఇప్పుడు టీఎస్ కాస్త టీజీగా మారితే మాత్రం కేవలం నెంబర్ ప్లేట్లు మాత్రమే కాదు.. చాలా మార్చాల్చి వస్తుంది. మరి.. కేవలం నెంబర్ ప్లేట్ల మీదే మారుస్తారా.. లేదా మొత్తం మారుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది కూడా రాష్ట్రంలో సర్వత్రా దుమారం రేపే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి.. రేపటి మంత్రి వర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో..!

ఇదిలా ఉంటే.. రేపటి కేబినెట్ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి ముఖ్యంగా చర్చించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఎప్పటి నుంచి, ఎప్పటివరకు నిర్వహించాలో కూడా రేపు నిర్ణయించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈసారి మరో రెండు పథకాలను అమలుపరిచే దిశగా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఈనెల 8న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై.. ఆరు రోజులు జరిగే అవకాశం ఉందని.. 9న బడ్జెట్‌ ప్రవేశపెట్టవచ్చని సమాచారం అందుతోంది.

0Shares

Related posts

రాజధాని బస్సులో పట్టుబడిన గంజాయి

News Telangana

కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ

News Telangana

పోతుగల్ లో గొర్ల మందపై కుక్కల దాడి

News Telangana

Leave a Comment