- కొన్ని బార్లకు నో రూల్స్ … నో క్లోజింగ్
- 24/7 ఓపెన్ లోనే ఉంటున్న పలు మద్యం బార్లు
- పేరుకే ఏం.అర్. పి కానీ లోపల అంతా అధికమే ..!
- గాడ నిద్రలో ఎక్సైజ్ నిఘా
- ఈ నిఘా వ్యవస్థ ఎప్పుడు మారెను?
- “ఖమ్మం జిల్లాలో ఓ లిక్విడ్స్ బార్ డాన్ మద్యం మాఫీయాపై ఆధిపత్యం చలాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి లిక్కర్ వ్యాపారంలో ఆరితేరిన ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలు దందాకు ఎగబడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి పేరుకే ఏం.అర్. పి ప్లెక్సీలు కానీ లోపల అంతా అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న చోద్యం చూస్తున్న జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు”
- ఖమ్మం జిల్లా బ్యూరో, మే 23 (న్యూస్ తెలంగాణ) :- ఖమ్మం జిల్లాలో ఓ లిక్విడ్స్ బార్ డాన్ మద్యం మాఫీయాపై ఆధిపత్యం చలాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ వ్యాపారంలో ఆరితేరిన ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలు దందాకు ఎగబడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులకి నెల వారీగా వాటాలు హోల్‌సెల్ పేరిట అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్న చోద్యం చూస్తున్న జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు. “న్యూస్ తెలంగాణ” విలేకరి గత వారం రోజులుగా సమాచారం అందజేస్తున్నప్పటికీ బార్ ని తనిఖీలు జరపని ఎక్సైజ్ శాఖ విషయంలోకి వెళ్తే ఖమ్మం నడిబొడ్డున లిక్విడ్స్ బార్, క్రిస్టల్ బార్ ఇలా పలు బార్లు 24/7 ఓపెన్ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు పేరుకు మాత్రమే ఎమ్మార్పీ అమ్మేది మాత్రం ఒక్కో క్వార్టర్ పై 40 నుంచి 50 రూపాయలు బీర్లపై 40 రూపాయలు ఇలా అధిక రేటు విక్రయిస్తున్నారు ఇదంతా ఎక్సైజ్ అధికారులకు ఆధారాలతో అందజేసిన పట్టనట్టే వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్న ఖమ్మం వన్ టౌన్ ఎక్సైజ్ శాఖ ను వివరణ కోరగా నీళ్లు మ్రింగుతూ చూస్తాంలే చేస్తాంలే అన్నట్లుగా సమాధానం ఇస్తున్న వన్ టౌన్ ఏక్సైజ్ అధికారులు ఇలా రాత్రుల సైతం బార్లు నడుపుతున్న ఈ లిక్కర్ దాని పై చోద్యం చూస్తున్న ఎక్సేంజ్ అధికారులపై వేటుపడేనా అని ఆలోచనలో పడ్డ ప్రజలు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వీరి ఇరువురిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న ప్రజలు
previous post
next post