- ఆధారాలు లేకుండా అనవసరమైన ఆరోపణలు చేయవద్దు
- వ్యక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడడం సరైన ధోరణి కాదు
- వనపర్తి ప్రెస్ క్లబ్ కమిటీ
న్యూస్ తెలంగాణ ఉమ్మడి పాలమూరు : ఒక వ్యక్తి తన ఉనికి కాపాడుకోవడానికి తప్పడు మెసేజ్ లు పెడుతే ఎంతటి వారినైనా వదలి పెట్టమని వనపర్తి ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు అంబటి స్వామి హెచ్చరించారు,గురువారం వనపర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా మాకు ఎవరు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేస్తూ ఎవరినైనా వ్యక్తిగత మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడుతే మన్నించేదే లేదన్నారు,జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో అవకతవకలు తరిగిన విషయం అందరికి తెలిసిన విషయమేనని,మాటలు అదుపులో పెట్టు కొని రాతలు రాస్తే గౌరవం ఉంటందని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్లాట్ల విషయంలో అవకతవకలు చేసిన కారకులు ఎవరో బయటపెట్టాలని ఆయన మాట్లాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం తప్పదని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోశాధికారి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ద్యారపోగు రవి ప్రసాద్, కాటేపాగ ఉస్సేన్, సీనియర్ జర్నలిస్టు దశరథం, ఉపాధ్యక్షులు కానమోని అంజనేయులు, కార్యదర్శి కడమంచి శేఖర్, సిరిగిరి శివ తదితరులు పాల్గొన్నారు.