- ఆర కొర ఫ్యాకల్టీ తో విద్యార్థులను అధిక ఒత్తిళ్లకు గురి చేస్తున్న ప్రైవేట్ కళాశాలలు
- విద్యార్థులను కళాశాలలో బంధించి వాళ్లపై ర్యాంకుల కోసం అధిక భారం మోపుతున్న కళాశాలలకు బుద్ధి చెప్పాలి
న్యూస్ తెలంగాణ, సూర్యాపేట జిల్లా బ్యూరో, అక్టోబర్ 20: చిలుకూరు మండల కేంద్రం సమీపంలోని కవిత జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వినయ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. హుజూర్నగర్ మండలం సబ్జాపురం గ్రామానికి చెందిన వినయ్ దసరా సెలవులు ముగించుకుని ఆదివారం ఉదయం కళాశాలకు వచ్చిన వినయ్ భోజనం సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.కళాశాల యాజమాన్యం హుటాహుటిన వినయ్ ను కోదాడ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికె మృతిచెందాడు. మార్కులు తక్కువ వచ్చాయని టీచర్లు మందలించినందుకే మా కుమారుడు మనస్తాపంతో తమ కుమారుడు మరణానికి పాల్పడ్డట్లు కన్నీరు మున్నీరయ్యారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రాంబాబు గౌడ్ దర్యాప్తు చేపట్టారు.