October 18, 2024
News Telangana
Image default
Andhrapradesh

మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు!

అమరావతి ( News Telangana ) : రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను మార్చి ఒకటో తేదీ నుంచి నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయిం చింది. ప్రాక్టికల్స్, వొకేషనల్, థియరీ పరీక్షలను మార్చి 20లోపు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉన్నందున.. పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాతో అధికారులు చర్చిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో సామాన్యశాస్త్రానికి రెండు పేపర్లు ఉండటంతో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక పరీక్ష పూర్తయిన మరుసటిరోజు సెలవు ఇవ్వాలా.. వద్దా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది

0Shares

Related posts

ఎమ్మెల్యే టికెట్ రేసులో శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్?

News Telangana

Pawan Kalyan: పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

News Telangana

కృష్ణా జిల్లాలో అదుపు తప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

News Telangana

Leave a Comment