ముచ్చటగా మూడోసారి సీఎం
కెసిఆర్ పాలన సుభిక్షం
డోర్నకల్ బిఆర్ఎస్ అభ్యర్థి డిఎస్ రెడ్యానాయక్
శ్రీశైలం దేవరశెట్టి మరిపెడ ప్రతినిధి నవంబర్ 27 న్యూస్ తెలంగాణ
తెలంగాణలో అమలవుతున్న పథకాలే దేశానికి ఆదర్శంగా నిలిచాయి మరిపెడ మండలంలో బిఆర్ఎస్ ప్రచారంలో భాగంగా సోమవారం గాలివారి గూడెం అబ్బాయి పాలెం బీచ్ రాజు పల్లి పురుషోత్తమయి గూడెం ప్రచారంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పాలన లో అన్నివర్గాలకు న్యాయం జరిగిందని ఆరు నూరైనా ఎవ రు ఎన్ని కుయుక్తులు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు. అనంతరం ఊళ్లేపెళ్లి గ్రామానికి చెందిన వీవీధ పార్టీల నాయకులు కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డోర్నకల్ అభ్యర్థి బిఆర్ఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న పథకాలతో లబ్ది పొందుతున్నారు కాబట్టే పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న షాదీ ముభరక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికీ నల్లానీరు లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న చేస్తున్న బీఆర్ఎస్ కారు గుర్తుకి ఓటేసి డోర్నకల్ అభివృద్ధికి మరో అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్యానాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు సీనియర్ కాంటాక్ట్ రామడుగు అచ్యుతరావు మాజీ ఒడిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి ఎంపీపీ అరుణ రాంబాబు జెడ్పిటిసి శారద రవీందర్ నాయక్ పురుషోత్తమాయగూడెం సర్పంచి నూకల అభినవరెడ్డి మాజీ ఎంపీపీ వెంకన్న కార్యకర్తలు యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.