- ఖజానాలోని డబ్బంతా హస్తం కాంట్రాక్టర్ కు అప్పగింత
- రైతుబంధు ఇవ్వడానికే కోటి కష్టాలు
- డిసెంబర్, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చినా పడని రైతుబంధు
- రేపు మాపు అంటూ సాగదీస్తున్న వైనం
- రాష్ట్రవ్యాప్తంగా అడుగు కూడా కదలని అభివృద్ధి
- సమీక్షల పేరుతో మంత్రుల కాలయాపన
- నిధులు రాకపోయినా శంకుస్థాపనలు చేస్తూ హడావుడి
- ఇదేనా ప్రజాపాలన అంటూ జనం సెటైర్లు
న్యూస్ తెలంగాణ, హైదరాబాద్ ( జనవరి 31 ) : తమ ప్రభుత్వం రాగానే అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల బండిలాగా పరుగులు పెట్టిస్తామని హస్తం నేతలు ఎన్నికల్లో పలికిన ప్రగల్భాలు.. ప్రగల్భాలుగానే మిగిలిపోతున్నాయి. రెండు నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అడుగు కూడా కదలకపోగా సంక్షేమం జాడపత్తాలేదు. సమీక్షలు చేస్తూ కాలం గడుపుతున్న మంత్రులు.. నిధులు లేకపోయినా, విడుదల చేయకపోయినా శంకుస్థాపన చేస్తూ హడావుడి చేస్తున్నారు.
- 15వేలు రైతుబంధు ఇస్తామని హామీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో రైతుబంధు ఇవ్వటానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెడీకాగా.. కొన్ని కారణాలతో ఎన్నికల సంఘం రైతుబంధును ఆపింది. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతుబంధు ఏస్తామని, అదికూడా ఎకరాకు 15వేల రూపాయలు ఇస్తామని చెప్పి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.
- ఖజానా డబ్బంతా హస్తం కాంట్రాక్టర్ కే
దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ప్రధాన నాయకుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వణరులను సమకూర్చాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడిస్తానని చెప్పి మరి ఆ పార్టీ అబ్యర్థులను ఓడించాడు. అయితే ఆయనకు సబంధించిన కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉండగా.. ఆ బిల్లులను రేవంత్ సర్కారు క్లియర్ చేసినట్టు తెలుస్తున్నది. రైతబంధు నిధులను దారి మల్లించినట్టు సమచారం.
- అభివృద్ధి శూన్యం
కాంగ్రెస్ రెండు నెలల పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. ఉన్న డబ్బులంతా హస్తం కాంట్రాక్టర్ కు ఇచ్చి అభివృద్ధికి ఎగనామం పెట్టారు. అధికాలరులతో మంత్రులు వరుస సమీక్షలు చేస్తూ.. నిదుల విడుదలపై ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. నియోజకవర్గాల్లో హడావుడి కోసం శంకుస్థాపనలు చేస్తూ ప్రజాపాలన చేస్తన్నామంటూ గొప్పలు చెప్తున్నారు. ఇగ సంక్షేమం దగ్గరకు వస్తే రైతుబంధు నిధులకే దిక్కులేదు. ప్రభుత్వం రాగానే రైతుబంధు 15వేలు ఇస్తామని చెప్పి… అధికారంలోకి వచ్చాక పాత పద్దతిలోనే ఇస్తామని చెప్పారు. ఆ రైతుబంధు డబ్బులన్నా ఇచ్చారా అంటే అదీ లేదు. డిసెంబర్, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చింది.. అయినా రైతన్నల ఖాతల్లోకి మాత్రం రైతుబంధు రాలేదు. పైగా ప్రశ్నించే రైతులను చెప్పుతోకొడతామని కాంగ్రెస్ నేతలు అనటంపై రైతన్నలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే అని సెటైర్లు వేస్తున్నారు