హైదరాబాద్, డిసెంబర్ 14 ( News Telangana ) :-
తెలంగాణ రాష్ట్ర ప్రజా భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క గురువారం గృహ ప్రవేశం చేశారు. ఈరోజు తెల్లవారు జామున ప్రజా భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అర్థిక & విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్ర మార్క కుటుంబ సమేతంగా నూతన గృహప్రవేశం చేశారు. అనంతరం కుటుంబ సభ్యు లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండి తులు మంత్రికి ఆశీర్వ చనాలు అందించారు. గృహ ప్రవేశం సందర్భంగా ప్రజాభవన్‌లో ప్రత్యేక అలం కరణ చేశారు.ఇక,గత ప్రభు త్వంలో ప్రగతి భవన్ సీఎం అధికారిక నివాసం ఉండగా కాంగ్రెస్ సర్కారు దాని పేరును ప్రజా భవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. ప్రజాభవన్ ను డిప్యూటీ సీఎం నివాసం కోసం అప్పగిస్తున్నట్లు బుధవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు
previous post