September 8, 2024
News Telangana
Image default
Crime NewsTelangana

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్


సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ దినపత్రిక ఫిబ్రవరి 25/
సూర్యాపేటలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. నిందితులపై కేసు నమోదు
డీజే సౌండ్ సిస్టమ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారి నుంచి రూ.25 లక్షల విలువ గల పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు సంబంధిత వివరాలను సూర్యాపేట డీఎస్పీ రవి వెల్లడించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు రోజువారీ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం జాతీయ రహదారి 65 పరిధిలోని జనగాం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న గూడ్స్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేయగా డిజే సౌండ్ సిస్టమ్‌కు సంబంధించిన ఎలక్రానిక్ పరికరాలను గుర్తించామని పేర్కొన్నారు.
వాహనంలోని నల్గొండ జిల్లా అడివి దేవులపల్లి మండలానికి చెందిన కుర్ర తుల్చా అనే వ్యక్తిని విచారించగా ఆ వస్తువులు అన్ని దొంగిలించినట్లుగా ఒప్పుకున్నట్లు తెలిపారు. అతడితో పాటు కోదాడకు చెందిన దరావత్ బాలకృష్ణ, బర్మావత్ గురు చరణ్. నల్లగొండ జిల్లాకు చెందిన రామావతు వంశీలతో కలిసి దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించాడని పేర్కొన్నారు అందుకు వారి వద్ద నుంచి 25 లక్షల విలువ గల సౌండ్ సీస్టమ్సు కు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలైన 27 ఆoప్లీఫయర్లు.7 క్రాస్ మిక్సర్లు. స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో తీవ్రంగా శ్రమించిన సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్. ఎస్సైలు షేక్ యాకోబు. పి లోకేష్. బాలకృష్ణ. క్రైమ్ సిబ్బంది కరుణాకర్. కృష్ణ. సైదులు. ఆనందు. మధు. ఐటీ సెల్ సుధాకర్. రవిలను ఎస్పీ అభినందించినట్లు డిఎస్పి తెలిపారు. ఈ సందర్భంగా కేసును సేదించిన సిబ్బందికి ఎస్పి కి రివార్డ్స్ ప్రకటించారు.

0Shares

Related posts

బస్టాండ్‌ సెంటర్లో గంజాయి అమ్ముతూ పట్టుబడిన యువకుడు

News Telangana

రాజధాని బస్సులో పట్టుబడిన గంజాయి

News Telangana

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పోలీసులు

News Telangana

Leave a Comment