News Telangana : రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నించిన హరీశ్రవుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ‘BRS హయాంలో ఈ పథకం నిబంధనలను ఇష్టానుసారం పెట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద ఫాంహౌస్ల ఓనర్లు, మంత్రులు రైతు బంధు రాలేదని బాధపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తాం. ఇది రైతు ప్రభుత్వం. అన్ని పథకాలను తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.